నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం.. స్పెషల్ డే ప్రకటన

నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం.. స్పెషల్ డే ప్రకటన

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసిన నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. జావెలిన్‌ త్రోలో అతడు పతకం సాధించిన ఆగస్టు 7వ తేదీని ఇకపై ఏటా ‘‘జాతీయ జావెలిన్ త్రో డే’’గా నిర్వహించబోతున్నారు. నీరజ్ చోప్రాను ఎప్పటికీ మన దేశం గుర్తుంచుకునేలా గౌరవించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 
ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారి జావెలిన్‌ త్రోలో ఫైనల్స్‌కు వెళ్లి ఆగస్టు 7న జరిగిన పోటీలో టాప్‌లో నిలిచి నీరజ్ చోప్రా భారత్‌కు గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టాడు. టోక్యో ఒలింపిక్స్ మొత్తంలో భారత్‌కు వచ్చిన ఏకైన బంగారు పతకం ఇదే. అంతే కాదు ఒలింపిక్స్ అథ్లెటిక్స్ (ట్రాక్ అండ్ ఫీల్డ్) చరిత్రలోనే భారత్ సాధించిన తొలి మెడల్‌ కూడా ఇదే. ఈ ఘనతను భారత్‌కు సంపాదిచిన పెట్టినందుకు నీరజ్ చోప్రాను మన దేశ చరిత్రలో చిరస్మరనీయంగా నిలిచిపోయేలా అథ్లెటిక్ ఫెడరేషన్ నిర్ణయం తీసుకుంది.